Tulasi : కార్తీక మాసం అతి పవిత్రమైనది. భక్తులు భక్తితో నిత్యం పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ప్రతి హిందూ కుటుంబం తమ ఇంటిలో తులసి మొక్కకు పూజలు చేస్తారు. ఇదే మాసంలో తులసి మొక్కకు కళ్యాణం కూడా జరిపించి తమ భక్తిని చాటుకుంటారు. తులసి మొక్కకు కార్తీక మాసంలో ఎప్పుడు కళ్యాణం చేయాలి అనే విషయాన్నీ వేదంలో ఈ విదంగా చెప్పబడింది.
వేద పండితుల పంచాంగం ప్రకారం తులసి కల్యాణం ముహర్తం ఈ విదంగా ఉంది. కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథి మంగళవారం, నవంబర్ 12 సాయంత్రం 4:02 గంటలకు ముహూర్తం ప్రారంభమై నవంబర్ 13 బుధవారం మధ్యాహ్నం 1:01 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 12 నుంచి తిథి ప్రకారం నవంబర్ 13న తులసి వివాహాన్ని జరుపుకుంటారు.
తులసి మొక్క వద్ద ఒక పీటను ఏర్పాటుచేసుకోవాలి. పీఠం చుట్టూ చెరకుతో మంటపాన్ని ఏర్పాటుచేయాలి. పీఠంపై కలశాన్ని పెట్టుకోవాలి. ముందుగా కలశాన్ని, గౌరీదేవిని, వినాయకుణ్ణి పూజించాలి. ఆ తురవాత తులసి మొక్కకు ధూపం, దీపం, వస్త్రాలు, దండలు, పువ్వులు సమర్పించాలి.
తులసి సౌభాగ్య సూచన మేరకు పసుపు , కుంకుమ, వస్తువులతో పాటు ఎరుపు రంగు చున్నీలతో అలంకరించాలి. ఆ తరువాత తులసి మొక్కకు మంగళ హారతి ఇవ్వాలి. ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఈ విదంగా పూజ చేసిన తరువాత ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్నవారికి తయారు చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి.
ఈ విదంగా తులసి కళ్యాణం చేయడం వలన ఇంటిలో సుఖశాంతులు వెలుస్తాయి. ఆర్థికంగా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. పిల్లలు విద్యాభివృద్ధిలో ఉంటారు. ఇంటి ఇల్లాలు, పిల్లలు ఎల్లప్పుడూ ఆరోగ్యముగా, సంతోషంతో ఉంటుంది.