Kamareddi : ముదిరాజ్ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పుడే వారి కుటుంబాలు అభివృద్ధిలో ఉంటాయని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ స్పష్టం చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో “ముదిరాజ్ మహాసభ మహిళా శక్తి సంఘం ” సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి విఠల్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులు అయినప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు.
ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారిశ్రామిక వేత్తలుగా కూడా ఎదగడానికి అవకాశం ఉందన్నారు. ముదిరాజ్ సంఘం కూడా ఎల్లవేళలా మహిళల సమస్యల పరిస్కారం కోసం ముందుంటుందన్నారు. ఏ సమస్య ఎదురైనా సంఘాన్ని సంప్రదించిన నేపథ్యంలో పరిస్కారం చేయడానికి కృషిచేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు, మండల మహాసభ అధ్యక్షురాలు జ్యోతి ముదిరాజ్, గ్రామ అధ్యక్షురాలు పోచవ్వ ముదిరాజ్ తో పాటు స్వ ప్నముదిరాజ్,రామక్కముదిరాజ్ బాలమణి ముదిరాజ్,హరిత ముదిరాజ్ కీర్తన ముదిరాజ్, ఎలారెడ్డి మండల అధ్యక్షులు ప్యాలల రాములు ముదిరాజ్, నాగిరెడ్దిపేట మండల,అధ్యక్షులు బాలయ్య ముదిరాజ్, జిల్లా నాయకులు సంతోష్ ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు