MLA Raja singh : ఆవేశంలో తీసుకున్న నిర్ణయమో, తొందరపాటు తో తీసుకున్న నిర్ణయమో , ఇతరుల మాటతో తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ , ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ఇప్పుడు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇన్నిరోజులు పాటు జాతీయ పార్టీ నీడన ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ బలం చెప్పలేనంత స్థాయిలో ఉంది. అటువంటి పార్టీ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో అయన పార్టీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంతోనే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ పార్టీ టికెట్ పై గెలుపొందిన ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. రాజీనామా చేసిన అనంతరం అయన ఆ పార్టీ, ఈ పార్టీలో చేరుతున్నా రంటూ పుకార్లు గుప్పుమన్నాయి. గతంలో కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద సస్పెండ్ అయ్యారు. తిరిగి పార్టీ చేర్చుకుంది. పార్టీ కీలక నేతలపై మీడియా ఎదుట విమర్శలు చేశారు.
పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఏ పార్టీలో చేరితే అనుకూలంగా ఉంటుందో ఆలోచించారు. కానీ ఆయన వ్యక్తిత్వానికి తగిన పార్టీ అందుబాటులో లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మల్లి పుట్టింటికి వెళితే ఎలా ఉంటుందనే ఆలోచన తన సన్నిహితుల వద్ద చేస్తున్నట్టుగా సమాచారం.