Sankranti : హిందూ కుటుంబాలకు మకర సంక్రాంతి ప్రధానమైన పండుగ. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరం దిక్కు వెళుతాడు. అప్పుడు ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి రోజు ఏ సమయంలో స్నానం చేయాలి. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. వీటన్నిటికీ అనుకూలమైన సమయం ఎప్పుడు ఉంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడంతోనే ఉత్తరాయణ కాలం మొదలవుతుందని వేదంలో చెప్పబడింది. 2025 లో సంక్రాతి పండుగను ఆనందంగా గడుపుకోడానికి సిద్ధమవుతున్నారు. భోగి, సంక్రాతి, మకర సంక్రాతి పండుగకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిండి వంటలు, బోగి మంటలు, కోడి పందాలు, గాలి పటాలు ఎగుర వేయడం వంటి కార్యక్రమాలతో ఆనందంగా గడపనున్నారు.
వేద పండితులు, వేదం పంచాంగంలో చెప్పబడిన ప్రకారం జనవరి 14న ఉదయం 9.03 గంటలకు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయం లోపు కుటుంబ సభ్యులు అందరు కూడా స్నానం పూర్తి చేసి పండుగ ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ ముహూర్తంతో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుందని వేదంలో చెప్పబడింది.