Karpooram pooja : కర్పూరం రెండు రకాలు. ఒకటి సాధారణ కర్పూరం. మరొకటి పచ్చ కర్పూరం. రెండింటితో పూజలు చేస్తారు. కానీ ఇందులో పచ్చ కర్పూరం పూజతోపాటు ఆరోగ్యానికి కూడా వాడుతారు. అనారోగ్యానికి గురైన వారు పచ్చ కర్పూరాన్ని వాడితే నయమవుతారని వైద్యశాస్త్రంలో చెప్పబడింది.
ముక్యంగా చాలా మంది పూజ కు సాధారణ కర్పూరాన్ని వాడుతారు. పచ్చకర్పూరాన్ని ఉపయోగించడం చాలా తక్కువ. పచ్చ కర్పూరంతో లక్ష్మీ దేవి కి పూజలు చేపడితే కోరినన్ని వరాలు ఇస్తుందని వేదంలో చెప్పబడింది.
వీలైనంత మేరకు లక్ష్మీ దేవి విగ్రహం తీసుకొని ఒక గిన్నెలో పెట్టండి. అందులో నీరు పోయండి. నీటితో ఉన్న గిన్నెలో పచ్చ కర్పూరం, పసుపు వేయండి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. ఇలా రెండు రోజులకోసారి నీటిని మార్చాలి. ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న వ్యతిరేకపవనాలు తొలిగిపోయి ఆర్థికంగా ఎదుగుతారు. ఆర్థిక సమస్యలు పరిస్కారమవుతాయి.
పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో పచ్చ కర్పూరం పెట్టి మూట కట్టాలి. ఆ మూటను ఇంటికి ఉన్న కుబేర స్థానంలో పెట్టి ప్రతిరోజూ దీపారాధన చేయాలి. ఈ విదంగా చేయడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం ఇంటికి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు వెంట, వెంట పరిస్కారమవుతాయి. ఆరోగ్య సమస్యలు ఉంటె కూడా నయమవుతాయి.