YS Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి … మాజీ ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత. ఐదేళ్లలో అధికారం ఉన్నన్ని రోజులు అయన చెప్పిందే వేదం అయ్యింది. అధికారం పోయింది. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది. పుట్టెడు కష్టాల్లో ఉన్న పార్టీకి మరో తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి గండం నుంచి ఎలా బయట పడాలి అని ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పరిస్థితులు సరిగా లేని ఈ సమయంలోనే ఉప ఎన్నికలు రావడంతో పార్టీ చిక్కుల్లో పడింది.
పులివెందుల నుంచి జెడ్పిటీసి గెలిచిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అదే విదంగా ఒంటిమిట్ట నుంచి జెడ్పిటీసి గా గెలిచిన వ్యక్తి ఇటీవల ఎమ్మెల్యే అయ్యారు. దింతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైనది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో స్థానిక ఎన్నికల్లో ఆయన అభ్యర్థులే ఉండాలి. మరో పార్టీ వారు పోటీ చేయరాదు. ఒక వేళా ఉప ఎన్నిక వచ్చినా వైసీపీ నాయకుడే ఏకగ్రివంగా ఎన్నిక కావాలి. ఇది ఆయన అధికారంలో ఉన్నన్ని రోజుల్లో నడిచిన సిద్ధాంతం.
మరి ఇప్పుడు అధికారం లేదు. ఆయన పార్టీ తరుపున పోటీచేసే అభ్యర్థి ముందుకు వస్తారో ? రారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏపీ లో అంతా కూటమి రాజ్యాంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఒకవేళ అభ్యర్థిని బరిలో దింపితే గెలుస్తారా ? ఓటమి చెందుతారా తెలియదు. ఓటమిపాలైతే పరువు పోతుంది. అదే విదంగా అభ్యర్థి ముందుకు రాకుంటే కూడా పరువు పోతుంది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. కాబట్టి జగన్ కు రెండు జెడ్పిటీసి స్థానాలు పరువుకు సవాల్ గా నిలిచాయంటున్నారు రాజకీయ పండితులు.