vastu tips : నిత్య జీవితంలో ప్రతి మనిషి ఎదో ఒక రూపంలో అప్పు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. అప్పు తెచ్చుకుంటారు. తిరిగి చెల్లిస్తారు. కానీ కొందరు మాత్రం తమ కుటుంబ అవసరాల నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తారు. అవి కుటుంబం ఆదాయాన్ని మించి పోతుంటాయి. కానీ అవి తీరవు. చేసిన అప్పులు తీరాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని పద్ధతులు పాటిస్తే కొంతవరకు అప్పులు తీరిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది.
అప్పుల నుంచి కోలుకోవాలంటే ప్రతిరోజూ గణపతి పూజ చేయండి. స్పటిక రూపంలో ఉండే గణపతి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి ప్రతిరోజూ పూజ చేసినచో ప్రతిఫలం దక్కుతుంది.
ఇంటి ఇల్లాలు లక్ష్మి దేవి బొమ్మ ఉండే గొలుసు మేడలో వేసుకోవాలి. లేదంటే లక్ష్మిదేవి బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించడం వలన కూడా ఆర్థికంగా బలపడి అప్పులు తీరే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది
వెండితో తయారు చేసిన లక్ష్మి దేవి విగ్రహానికి ప్రతిరోజూ పూజ చేయాలి. సాధ్యమైనంత మేరకు ప్రతి శుక్రవారం ఉదయం, సాయంత్రం పూజ చేసినచో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఎదుగుతారు. అప్పులు తీరుతాయి.
రాగి, ఇత్తడి, మట్టి తో తయారు చేసిన వాటిలో ఏవయినా సరే రెండు దీపం ప్రతిమలను పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి. వాటిని ఉదయం సాయంత్రం వెలిగించాలి. దూదితో స్వయంగా తయారుచేసిన వత్తులతో నూనె తో వెలిగించాలి. ఈ రెండు దీపాలను గణపతి, లక్ష్మి దేవి విగ్రహాల ముందు పూజ గదిలో పెట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజ చేసినచో ఆర్థికంగా కుటుంబం అభివృద్ధి చెంది, అప్పులు మెల్ల,మెల్లగా తొలగి పోతాయని వాస్తు శాస్త్రంతో పాటు వేదంలో చెప్పబడింది.