YCP-AP : రాష్ట్ర మాజీ మంత్రి అని కూడా చూడకుండా రెండున్నర నెలల నుంచి జైల్లో పెట్టారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తమ పార్టీ నాయకులను అకారణంగా అరెస్టు చేస్తున్నారని ప్రజలకు చెప్పుకుంటున్నారు. వంశీ పేరు నుంచి మొదలుకుని గల్లీ నాయకుడి వరకు అరెస్ట్ అయిన వారి పేర్లు ప్రజలకు చెబుతూ ఆవేదన చెందుతున్నారు. ఇదంతా వింటున్న ప్రజలు మాత్రం తప్పుడు అరెస్టులు జరుగుతున్నాయని కానీ, రాష్ట్రంలో రాజకీయ కక్షలు జరుగుతున్నాయని కానీ ఎక్కడ కూడా అనుకోవడం లేదు. కనీసం ప్రజల నుంచి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు సానుభూతి కూడా రావడం లేదు. ఇందుకిలా జరిగింది …. ?
రాజకీయాలకు ఆవేశం పనికిరాదు. ఆవేశంతోనే పరిపాలన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అయన ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతుంటే పైశాచిక ఆనందాన్ని పొందారు. జగన్ ఆలోచనలకు బలికాని నేతలు టీడీపీ, జనసేన నేతలు ఎవరు లేరనడానికి వీలులేదు. అటువంటి పరిపాలన ఐదేళ్లు కొనసాగింది. అయన ఐదేళ్ల పరిపాలనకు విసిగిపోయిన ప్రజానీకం ఎలా దెబ్బ తీయాలో అలా తీశారు. కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పుడు పైశాచిక ఆనందాన్ని పొందిన వైసీపీ నేతలకు ఇప్పుడు జైలులో పప్పన్నం తప్పడంలేదు.
తాము ఎలాంటి తప్పుచేయలేదని, అకారణంగా తమను ప్రభుత్వం వేధిస్తోందని ప్రజలతో చెప్పుకోడానికి వైసీపీ నేతలు ప్రయత్ని స్తున్నారు. ఎవరిని కూడా అకారణంగా అరెస్ట్ చేయడంలేదు. అరెస్టు అయిన వారంతా కూడా బెయిల్ కోసం సుప్రీం కోర్ట్ గడప తొక్కివచ్చినవారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయని ప్రజలు అనుకోడానికి అవకాశమే లేదంటున్నారు రాజకీయ పండితులు.
వైసీపీ పాలనలో తప్పులు చేసి జైలు కు వెళ్ళినవారు ఎవరూ లేరు. జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందానికి, అవినీతికి బలైన వారే ఉన్నారు. వంశీ , కొడాలి నాని, పోసాని కృష్ణ, కాకాణి ఇలా ఎందరో జగన్ మోహన్ రెడ్డి చేష్టల వల్లనే కస్టాలు, నష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పటికయినా సత్యం తెలుసుకొని ప్రజల్లో కలిసి ఉంటేనే ఎంతో కొంత రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ప్రజలు రానున్న రోజుల్లో మరింత అందనంత లోతుకు తొక్కేయడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు.