YS JAGAN : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ సమావేశంలో పాల్గొనడం బాగానే ఉంది. కానీ ఆయన కొత్త గెటప్ లో రావడమే నాయకులకు ఆశ్చర్యం కలిగింది. నవ్వుతూ రావడం బాగానే ఉంది. నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారు. ఇది బాగానే ఉంది. కానీ మాసిపోయిన గడ్డం తో వచ్చారు. ఇలా అప్పుడప్పుడు పార్టీ సమావేశాల్లో వచ్చిన సందర్భాలు ఉన్నవి….. కానీ ఇక్కడ మరో విశేషం ఉంది ….అది ఏమిటంటే….
పార్టీ సమావేశానికి వచ్చిన జగన్ ఫోటోలను పార్టీ నాయకులు కొందరు మీడియాకు పంపారు. జగన్ నుదుట బొట్టు పెట్టుకొని సమావేశానికి వచ్చారు. అలా బొట్టు పెట్టుకొని ఉన్న ఫోటోలను ప్రత్యేకంగా తీసి పంపడంతో ఇప్పుడు ఆ విషయం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆ ఫోటోలను చూసిన వైసీపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. బొట్టు ప్రధానంగా కనిపించే విదంగా ఫోటో తీసి పంపిన ఫోటోలను చూసిన వారు ఏమి అర్థం కాక తలపట్టుకుంటున్నారు.
ఎవరైనా ఇంటిలో పూజలు చేస్తే బొట్టు పెట్టుకుంటారు. లేదంటే గుడికి వెళితే అక్కడ పూజారి బొట్టు పెట్టి ఆశీర్వాదం చేస్తారు. మరి జగన్ ఇంటిలో పూజలు చేశారా ? గుడికి వెళ్ళారా ? అనే విషయం తెలియక వైసీపీ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఎన్నడూ బొట్టు పెట్టని జగన్ మోహన్ రెడ్డి ఇలా బొట్టు సీ(శీ)ను గెటప్ లో రావడంతో పార్టీ సమావేశంలో నాయకులు ఒకరి మొహం ఒకరు చూసుకోక తప్పలేదు.