singareni : సింగరేణి బొగ్గుగనులపై ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55 వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 సింగరేణి గనిపై యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గని ఆవరణలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేక్ కోసి పంపిణీ చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు దేవి భూమయ్య, బన్న లక్ష్మన్ దాస్ లు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్లు కొనసాగిన అవినీతి పరిపాలనను అంతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన పోరాటం ఫలించిందన్నారు. అధికారం చేపట్టిన నాటినుంచి ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కేవలం సీఎం కె దక్కుతుందన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, నియామకాలు , బదిలీలు చేపట్టి విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారని అన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటా ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కె దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, సీనియర్ నాయకులు బన్నా లక్ష్మణ్ దాస్, ఈదునూరి బాపు, సొగాలకన్నయ్య, ఎర్రవల్లి శంకర్, పూస రాజేష్, రాజ్ కుమార్, శ్రీకాంత్ పాండే , బాల్త శీను, తిరుపతి ,సంపతి మహేష్ , ధరణి సాయి, రాజ్ కుమార్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవతం చేశారు