Singareni : మందమర్రి ఏరియా సింగరేణి కార్మికుల అపరిష్కృత సమస్యల పరిస్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఏరియా INTUC కార్యదర్శి ఈదునూరి బాపు స్పష్టం చేశారు. భాద్యతలు చేపట్టిన అనంతరం బాపును ఏరియాలోని కాసిపేట-1 గని యూనియన్ నాయకులు,కార్యకర్తలు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా బాపు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిస్కారంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. రాబోయే రోజుల్లో యూనియన్ బలోపేతం చేయడానికి కృషిచేస్తానన్నారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్, కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, ఐఎన్టీయూసీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.