Minaksi : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి అధిష్టానం ఇంచార్జిలను నియమిస్తుంది. ఆ విధంగా నియామకం అయిన వారి అభిప్రాయాలు ఒక్కో విదంగా ఉంటాయి. కొందరు పార్టీ అధికారంలో ఉంటె పరిపాలనలో జోక్యం చేసుకుంటారు. మరికొందరు కేవలం పార్టీ బలోపేతం కోసమే పరిమితం అవుతారు. గతంలో వచ్చిన ఇంచార్జి దీపాదాస్ మున్సీ పరిపాలనలో జోక్యం చేసుకున్నారు. కానీ ఇటీవల వచ్చిన మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతం కోసం పాదయాత్రకు సిద్ధమయ్యారు. జులై 31 నుంచి తెలంగాణ లో పాదయాత్ర చేయడానికి సిద్ధం కావడంతో పార్టీ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పాదయాత్ర వారం రోజుల పాటు ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. ప్రతి రోజు ఎనిమిది నుంచి పది గంటల పాదయాత్ర చేసే విదంగా పార్టీ ఏర్పాట్లు చేసింది. నిర్ణయించిన నియోజక వర్గాల వారిగా పాదయాత్ర ఉంటుంది. గ్రామాలు, పట్టణాలు, మండలాలల్లో ఉన్న నాయకుల, కార్యకర్తల సమస్యలు, అదే విదంగా ప్రభుత్వ పరంగా ప్రజల అపరిష్కృత సమస్యలపై ఆమె దృష్టి సారించనున్నారు.
పాదయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే విదంగా ఏర్పాట్లు చేశారు. నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను కూడా పరిష్కరించనున్నారు మీనాక్షి నటరాజన్. ఆమె వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండనున్నారు. మొదటి సారి పార్టీ ఇంచార్జి పాదయాత్ర చేపట్టడంతో ఏ మేరకు సత్పలితాలను ఇవ్వనుందో వేచి చూడాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు