Mlc kavitha : బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ కు ఆర్డినెన్స్ పంపింది. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తోంది. కాంగ్రెస్ నాయకులు ఆగష్టు 5 నుంచి 7 తేదీ వరకు ఢిల్లీ లో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళ కంటే ముందు ఒక అడుగు వేశారు కవిత. ఆమె ఆగష్టు 4 తేదీ నుంచి 6 తేదీ వరకు అంటే 72 గంటల దీక్ష చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బంది కాకపోయినప్పటికీ, గులాబీ పార్టీకి మాత్రం తలనొప్పిగానే తయారైనది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు,, ప్రజాసమస్యలు కావచ్చు బిఆర్ఎస్ కంటే ముందుగానే నిరసన కార్యక్రమాలు జాగృతి నేతలతో చేపడుతోంది.
బీసీ రిజర్వేషన్ కోసం సుప్రీం కోర్ట్ కు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతోనే అక్కడ సమస్య పరిస్కారం అయ్యిందని వివరించారు. బీజేపీ తో కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా ఉన్న స్నేహ పూర్వక వాతావరణంతోనే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లడం లేదని ఆమె ఆరోపించారు. గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఉన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించు కోడానికి తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్లడంతోనే పరిస్కారం అయినట్టుగా ఆమె గుర్తు చేశారు.
కవిత బీజేపీ ని మాత్రం ఎండగడుతున్నారు. మరోవైపు ఆమె మాట్లాడే మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సలహా ఇచ్చినట్టుగా ఉన్నాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆమె మాటలను కొట్టిపారేస్తున్నారు. తమతో వచ్చి ఢిల్లీ లో నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు అంటుంటే, కవిత మాత్రం అన్ని పార్టీలను పిలవాలని అనడం కొసమెరుపు.