Friendship : శత్రువు ఏవిధంగా దాడి చేస్తాడో గమనించవచ్చు. కానీ స్నేహం చేస్తున్న మిత్రుడు ఎలా దాడి చేస్తాడో తెలుసుకోలేము. స్నేహం అనే ముసుగులో నమ్మించి మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాడని అపర మేధావి, ఆర్థిక వేత్త చాణక్యుడు తన గ్రంథాల్లో పేర్కొన్నాడు. స్నేహం అనే ముసుగులో మనకు ఈ విదంగా శత్రువులు తయారవుతారు.
మనం తప్పు చేస్తే ఆ తప్పును తప్పు అంటూ నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తే నిజమైన మిత్రుడు. ఆ తప్పును చెప్పకుండా పొగుడుతూ, వెకిలిగా మాట్లాడే వ్యక్తి స్నేహం ముసుగులో ఉన్న శత్రువు.
మనం ఎదుగుతున్నది తట్టుకోలేక మన వద్ద అప్పు తీసుకొని స్నేహాన్ని అడ్డు పెట్టుకొని ఇబ్బంది పెట్టే వ్యక్తి స్నేహం ముసుగులో ఉన్న శత్రువు.
మన వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటూ, స్నేహం ముసుగులో తప్పుదోవ పట్టిస్తారు . కాబట్టి అటువంటివారు ఇచ్చే సలహాల విషయంలో కుటుంబ పరంగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి.