Telangana : తెలంగాణ లో భూకంపం రానుందా ? అంటే అవుననే అంటున్నారు కొందరు. అంటే ఈ భూకంపం వస్తున్న విషయం శాస్త్రవేత్తలు తెలుపలేదు. అంటే ఇది ప్రకృతి వైపరిత్యాల కారణంగా సంభవించేది కాదు. రాజకీయ ప్రకంపనలతో ఏర్పడుతున్న భూకంపం. పక్కా ఆగష్టు 4న రాజకీయ భూకంపం వస్తోంది. అందుకే ప్రధాన పార్టీల నేతలు ఆరోజు ఏం జరుగుతుందో అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు….
బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు కమిషన్ ను ఏర్పాటు చేసింది. విచారణకు రిటైర్డ్ జడ్డి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.
2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటైనది.
విచారణ 15 నెలల పాటు కొనసాగింది.
విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ హాజరైనారు.
వీరితో పాటు మరో 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది.
ఆగస్టు 1 న కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఆగస్టు 4న నివేదిక సారాంశాన్ని కమిషన్ రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించనుంది.
అదేరోజు అంటే ఆగష్టు 4న కేబినెట్ కమిటీ సమావేశమై కాళేశ్వరం నివేదిక పై చర్చ.
దీంతో ఆగస్టు 4న ఏం జరుగుతుందోనని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కమిషన్ నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని బిఆర్ఎస్ నేతలు ప్రకటించడం కొసమెరుపు .