Divali : దసరా పండుగ ఆనందంగా ముగిసింది. ఇప్పుడు వచ్చేది దీపావళి పండుగ. ఈ పండుగ అంటేనే లక్ష్మీదేవి పండుగ అని పిలుస్తాం. భక్తి శ్రద్దలతో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఈ పండుగను అక్టోబర్ 31 అని కొందరు, మరికొందరేమో నవంబర్ ఒకటిన అని కొందరు అంటున్నారు. కానీ పంచాంగం ప్రకారం ఏరోజు జరుపుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తవానికి దీపావళి పండుగ ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు వస్తుంది. అమావాస్య కు ఒకరోజు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి గా భావించి జరుపుకుంటాం.
పంచాంగం ప్రకారం ప్రదోష అమావాస్య అక్టోబర్ 31న.. నవంబర్ 1న.. ఈ రెండు తేదీలల్లో వస్తుంది. నవంబర్ 1న ఆయుష్మాన్ యోగం.. స్వాతి నక్షత్రం. అందుకని వేద పండితులు దీపావళి పండుగను నవంబర్ 1న జరుపుకోవాలంటున్నారు.
పంచాంగంలో చెప్పబడిన ప్రకారం లక్ష్మీ పూజ సూర్యాస్తమయం నుంచి అర్థరాత్రి వరకు జరుగుతుంది. ఈ లెక్కన అమావాస్య తిథి, ప్రదోషకాలం, శుభ సమయాల ప్రకారం ఆక్టోబర్ 31న దీపావళిని జరుపుకోవడం మంచిదంటున్నారు.
ఈ ఏడాది దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలి అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. వేద పండితులు పంచాంగం ప్రకారం ఏరోజు జరుపుకోమంటారో వేచిచూడాల్సిందే.