Mela : మహా కుంభ మేళ జనవరి 13 తేదీన ఘనంగా ప్రారంభం కాబోతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగనుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించాలనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరే రోజు రాణే వచ్చింది. జనవరి 13 తేదీ నుంచి 45 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. దేశంలోని నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి రావడానికి సమయం ఆసన్నమైనది.
కుంభమేళా జరిగే 45 రోజులు పవిత్రమైనవి. ఈ 45 రోజులు త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తారు. కానీ 45 పవిత్రమైన రోజుల్లో మరో ఆరు రోజులు అత్యంత పవిత్రమైనవని వేదం పండితులు చెబుతున్నారు. ఈ ఆరు రోజుల్లో ఏరోజైనా పవిత్రమైన గంగా నదిలో స్నానమాచరిస్తే మోక్షము సిద్ధిస్తుందని వేదంలో చెప్పబడింది.
45 రోజులు గంగానదిలో స్నానం చేయడానికి భక్తులు రావడానికి సిద్ధమయ్యారు. మరి కొందరు అతి పవిత్రమైన ఆరు రోజుల్లో స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ ఆరు రోజులు ఏమిటంటే…. జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తే మోక్షము సిద్ధిస్తుందని వేదపండితులు చెబుతున్నారు.