Masa sivaratri : శివరాత్రి, మాస శివరాత్రి ఈ రెండు కూడా హిందువులకు చాల పవిత్రమైన శుభ దినములు. శివరాత్రి రోజు ఏమి చేయాలనేది భక్తులకు తెలిసిన విషయమే. కానీ మాస శివరాత్రి ఎప్పుడు వస్తుంది. ఆరోజు ఎలాంటి పూజలు చేయాలి. పూజలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అనేది చాలా మంది భక్తులకు తెలియదు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం.
పంచాంగంలో ఈ ఏడాది జేష్ఠ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి జూలై 4వ తేదీ 2024 ఉదయం 5:44 గంటలకు మాస శివరాత్రి ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు జూలై 5వ తేదీ ఉదయం 5:57 గంటలకు మాస శివరాత్రి పూర్తవుతుంది. కాబట్టి పంచాంగం లో చెప్పబడిన ప్రకారం జేష్ఠ మాసంలో మాస శివరాత్రిని జూలై 4వ తేదీ 2024 గురువారం జరుపుకోవడం శుభంగా ఉంటదని వేద పండితులు చెబుతున్నారు.
మాస శివరాత్రి పండుగ చాల పవిత్రమైనది. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిధిన భక్తి శ్రద్దలతో కుటుంబ సభ్యులు జరుపుకుంటారు. కుటుంబం అంతా ఉపవాసం ఉండి శివ పార్వతులను భక్తిశ్రద్దలతో పూజిస్తారు. దింతో ఆది దంపతుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. జేష్ఠ మాసంలో వచ్చే శివరాత్రి చాలా పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. ఎందుకంటే ఆ రోజు చాలా అరుదైన పవిత్రమైన యాదృచ్ఛికాలు జరుగుతాయి.
మాస శివ రాత్రిన అరుదైన భద్ర యోగం సైతం జరుగుతుంది. ఈ యోగంలో శివ పార్వతులను ఆరాధించిన భక్తులకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అదేవిదంగ చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారానే నమ్మకం కూడా భక్తులకు ఉంది. ఈ యోగం జూలై 4వ తేదీన ఉదయం 5:54 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:23 గంటలకు ముగుస్తుంది.
జూలై నాలుగో తేదీన వృద్ధి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జూలై 5న సాయంత్రం 5:14 గంటల వరకు ఉంటుంది. వృద్ధి యోగంలో శివ, పార్వతులను పూజించడం వలన భక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అదేవిదంగా అదృష్టం కూడా కుటుంబానికి కలిసివస్తుందని నమ్ముతారు.