Singareni : సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఈ నెల 25న దీపావళి బోనస్ ను చెల్లించడానికి సింగరేణి యజమాన్యం నిర్ణయం తీసుకొందని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ – సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్ తెలిపారు.
ప్రతి ఏటా కార్మికులకు దీపావళి బోనస్ చెల్లిస్తున్నట్టుగానే , ఈ ఏడాది కూడా చెల్లించాలని యాజమాన్యంను గుర్తింపు సంఘం హోదాలో కోరడం జరిగిందన్నారు. సంఘం విజ్ఞప్తి మేరకు సింగరేణి యాజమాన్యం అంగీక రించిందన్నారు. సంస్థలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి రూ : 93,750 ఈ నెల 25న బ్యాంకు ఖాతాలో జమకానున్నాయని ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.