Tortoise : చేతి అందం కోసం ఉంగరం పెట్టుకుంటారు. వెండి, బంగారం, రాగి ఉంగరాలను ధరిస్తారు. వాటికీ జాతకరీత్యా రత్నాలను పెట్టిస్తారు. ఇంకొందరు ఉంగరాలకు డైమండ్ పెట్టిస్తారు. ఇటీవల మరికొందరు తాబేలు ఉంగరం పెట్టుకుంటున్నారు. అయితే చాలా మందికి తాబేలు ఉంగరం ఎప్పుడు ధరించాలి. ఎలా చేయించాలి. ఏ చేతి వేలుకు పెట్టుకోవాలి అనే నిబంధనలు వేదంలో ఈ విదంగా చెప్పబడింది.
తాబేలును పవిత్రంగా భావిస్తారు. సంపదకు ఒక చిహ్నం. తాబేలు ఉంగరాన్ని ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. రాగి, ఇత్తడి తో చేసిన ఉంగరం పనికిరాదు. కేవలం వెండితో చేసిన తాబేలు ఉంగరం మాత్రమే ఎవరికయినా పనిచేస్తుంది. కుడిచేయి మధ్యవేలు, లేదంటే చూపుడు వేలుకు మాత్రమే భరించాలి.
ఉంగరం చేయించిన వెంటనే ఆవుపాలతో శుభ్రం చేయాలి. ఆ తరువాత ఏదయినా నదీజలంతో శుభ్రం చేయాలి. పూజగదిలో పెట్టి లక్ష్మిదేవి పారాయణం చేయాలి. ఆ తరువాత ఉంగరాన్ని ధరించాలి. అనుకోని పరిస్థితుల్లో తీస్తే , పాలతో శుభ్రం చేసి ధరించాలి.
తాబేలు ఉంగరాన్ని ధరించిన వారికి నెగటివ్ ఎనర్జీ తగ్గిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటిలో ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఉంగరం ధరించిన వ్యక్తి ఆరోగ్యముగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.