రక్షణ ఏర్పాట్లలో విఫలం
ఉత్పత్తి పైననే యాజమాన్యం ధ్యాస
ప్రమాదాలకు భాద్యులైన అధికారులపై చర్యలు శూన్యం
CPM మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి
Singareni : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాల వలన సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయని CPM మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి ఆరోపించారు. సోమవారం ఆయన మందమర్రిలో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం రక్షణతో కూడిన ఉత్పత్తిని పక్కకు పెట్టేసిందని ఆరోపించారు. కేవలం ఉత్పత్తి పై ఉన్న ధ్యాస కార్మికుల ప్రాణాలపై లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఉత్పత్తి,లాభల కోసం పాకులాడుతూ రక్షణ వ్యవస్థను, నిబంధనలను గాలికి వదిలేయడం జరిగిందన్నారు. పని ప్రదేశాల్లో ఎలాంటి రక్షణ లేక పోవడంతో కార్మికులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో కార్మికులకు ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యానికి,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడ లేదన్నారు.
సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ CPM అధ్వర్యంలో ఆగస్టు 6 న ఛలో మందమర్రి GM కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు,కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సంకే రవి ఈ సందర్బంగా కోరారు.