పుచ్చకాయ చూడటానికి నల్లగా గుండ్రముగా ఉండి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ శరీరంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుంది.మోయడానికి బరువు ఉన్న పుచ్చకాయ మన శరీర బరువును అతిసులభంగా తొలగిస్తుంది.చాల వరకు వేసవిలో వచ్చే సమస్యలను ఎదుర్కొని శరీరానికి మేలు చేస్తుంది.కిడ్నీ,ఊపిరితిత్తులు,గుండె,పేగులు, మలబద్దకం,వడదెబ్బ,గొంతు,నీరసం, మూత్రాశయం వంటి శరీర భాగాల్లో వచ్చే వ్యాధులను అరికడుతుంది. కాబట్టి వేసవిలో పుచ్చకాయ రసాన్ని తాగితే ఆరోగ్యాన్ని ఎలాంటి మందులు తీసుకోకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. సోడియం, పొటాషియం, ఐరన్ మరియు విటమిన్ సి మొదలైనవి పుచ్చకాయలో పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల వేసవిలో వచ్చే వ్యాధులు తగ్గుతాయి మరియు శరీరం కూడా చాలా కాలం పాటు హైడ్రేషన్‌గా ఉంటుంది.
శరీర బరువు తగ్గించడానికి చాల ఉపయోగపడుతుంది. కొవ్వు శాతం తగ్గి బలహీనత,నీరసం తగ్గిపోతుంది.వేసవిలో నిత్యం రసం తీసుకోవడం వలన బరువు అదుపులో ఉంటుంది.బీపీ ఉన్నవారికి చాల వరకు మేలు చేస్తుంది. రక్త నాళాలను శుద్ధిచేస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ శతం ఎక్కువగా ఉన్నవారికి రసం ఏంటో మేలుచేస్తుంది.క్రమం తప్పకుండ రసం తాగితే నెలరోజుల్లో కొలెస్ట్రాల్ సమస్య తగ్గిపోతుంది.గుండె నాళాలు కూరుకుపోయి ఉన్నవారికి మేలుచేస్తుంది.హార్ట్ స్ట్రోక్ ఉన్నవారికి రసం వలన ఇబ్బందులు తొలిగిపోతాయి. రసం తీసుకోవడం వలన HDL ఉండాల్సినంత స్థాయిలో ఉంటుంది.
పుచ్చకాయ రసానికి నల్ల మిరియాల పొడి కలిపి తాగితే చర్మానికి చాల లాభాలు కలుగుతాయి.మిరియాల పొడి,రసం వలన వేసవిలో వచ్చే చర్మ వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. చర్మం కాంతివంతమవుతుంది. చర్మం తాజాగా ఉంటుంది. నల్లటి వలయాలను తొలగిస్తుంది. వేసవిలో వచ్చే వడదెబ్బ రాకుండా నిరోధిస్తుంది. ఒకవేళ వడదెబ్బ సోకిన వారికీ మిరియాల పొడితో రసం కలిపి తాగితే చాల ఉపశమనం కలుగుతుంది. వేడి నుండి రక్షిస్తుంది.
వేసవి కాలంలో మీ కడుపు ఆరోగ్యాంగా ఉండాలంటే కనీసం రెండు,మూడు రోజులకోసారైనా పుచ్చకాయ ముక్కలను తినాలి. రసానికి కొంచెం మిరియాల పొడి కలిపి తాగితే చాల ఆరోగ్యాంగా ఉంటారు. దీని ద్వారా మలబద్దకం,గ్యాస్,ఎసిడిటి వంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరానికి ఉన్న నీటి లోపాన్ని సరిచేసి, చర్మ వ్యాదులని తగ్గిస్తుంది.
పుచ్చకాయ ను నేరుగా తిన్నా,రసం తాగినా శరీరంలో ఉన్న ఎసిడిటిని తగ్గిస్తుంది. రసం తాగడం వలన పొటాషియం లోపం ఉన్నవారికి తొందరగా నయమవుతుంది. కడుపులో మంట,అజీర్ణం,నొప్పి ఉన్నవారు పుచ్చకాయ ముక్కలు తిన్నచో వెంటనే ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయ రసాన్ని ఉప్పు కలిపి తాగితే శరీరంలో మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి.
మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ ఉంటె రెండు మూడు రోజులు తాగితే తగ్గిపోతుంది.మూత్రంలో మంట ఉన్నవారికి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది పుచ్చకాయ జ్యూస్. మూత్ర పిండాల్లో ఉన్న రాళ్లను కరిగిస్తుంది. మూత్ర పిండాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా తొలగిపోతుంది. మూత్ర పిండాలకు పుచ్చకాయ ఉత్తమమైనది. జీర్ణశక్తి పెరుగుతుంది. అంతే కాదు ఎసిడిటిని అతితొందరగా తొలగిస్తుంది.
గుండెలో మంట,గ్యాస్ సమస్య,ఛాతిలో గాని, వీపుపై గాని మంట, నొప్పి రావడం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మింగడానికి గొంతులో ఇబ్బందిగా ఉంటుంది. పలు సందర్భాల్లో గొంతులో చప్పగా,పుల్లగా ఉన్నట్టు తెలుస్తుంది.పలువురు ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ సమస్యకు వేసవి కాలంలో చాల ఉపశమనం కలిగించే ఔషధం లాంటి పుచ్చకాయ ఉంది. ఈ ఇబ్బందులను తొలగించేది పుచ్చకాయ జ్యూస్ పుచ్చకాయ రసానికి సరిపడేంత మిరియాల పొడిని కలిపి తాగడం వలన శరీరానికి పలు విధాలుగా ప్రయోజనాలు లభిస్తాయి.
సూచన: ఏమైన వ్యాధులు , అలర్జీ సమస్యలు ఉన్ననేపథ్యంలో మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకున్న తరువాతనే పుచ్చకాయ రసం
తాగాలి.
–—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-