వింటే భారతమే వినాలి.తింటే గారెలే తినాలి. తింటే హైదరాబాదు లోనే బిర్యానీ తినాలి.అవియల్ వంటకం తినాలి అంటే కేరళ వెళ్ళాలి.అదేవిదంగా సినిమా విషయానికి వస్తే తమిళంలో రజని కాంత్,తెలుగులో చిరంజీవి సినిమాలంటే ఆ రెండు ప్రాంతాల సినీ అభిమానులు ఇష్టపడుతారు.కానీ తెలుగులో ఒక వెలుగు వెలుగుతున్న ఆ నటుడి సినిమా వస్తోందంటే కేరళలో సినిమా హాళ్లు ముందుగానే టికెట్ బుకింగ్ తో నిండుకుంటాయి. కనీసం వారం రోజుల వరకు ఆ తెలుగు నటుడి సినిమా చూడాలంటే టికెట్ దొరకదు. బ్లాక్ లో అయినా సరే టికెట్ కొనాల్సిందే, ఆ నటుడి సినిమా చూడాల్సిందే కేరళ సినీ అభిమానులు.ఆ తెలుగు నటుడికి కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులు తయారయ్యారు.ఆయన సినిమా వచ్చిందంటే సినిమా థియేటర్లను అలంకరించడానికి అభిమానులు పోటీపడుతారు.ఇంతకీ కేరళ సినీ అభిమానులకు పిచ్చెక్కిస్తున్న ఆ తెలుగు హీరో ఎవరు. తెలుసుకోవాలంటే చదవాల్సిందే. బహుశా ఈ బొమ్మ చూస్తే అర్ధమయ్యే ఉంటది
కేరళ రాష్ట్రము సినీ అభిమానులు ప్రముఖ తెలుగు నటుడు అల్లు అర్జున్ సినిమాలంటే పడిచస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన ” ఆర్య ” సినిమాతో కేరళలో ఆయనకు అభిమానులు తయారయ్యారు. ఆలా మొదలయిన అల్లు అర్జున్ ప్రభంజనం కేరళలో నేటికీ కొనసాగుతోంది.అర్జున్ పాటలో డాన్స్ చేస్తున్నాడంటే థియేటర్లలో చప్పట్లు,ఈలలు,కేరింతలు,పూలు చల్లడం మొదలవుతుంది. అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా కేరళలో విజయవంతం అవుతుంది.ప్రతి ధియేటర్ వారం రోజులపాటు హౌసేఫుల్ బోర్డు తో ఉంటుంది. అభిమానులతో కిటకిటలాడుతుంది. “ఆలా వైకుంఠ పురం” సినిమా కేరళలో “అంగు వైకుంఠపురత్తు ” పేరుతో విడుదల అయ్యింది. ఆ సినిమా ఒక టీవీ ఛానల్ లో ప్రసారమయితే భారీ రేటింగ్ వచ్చింది.
మలయాళ సినీ అభిమానులంటే కూడా అల్లు అర్జున్ కు అభిమానమే.అక్కడి ప్రజలకు అప్పుడప్పుడు సహాయం కూడా చేస్తుంటారు.కేరళలో వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రజలకు నేనున్నా అంటూ అభయం ఇచ్చాడు. అంతేకాదు వరదల్లో నష్టపోయిన వారికీ ఆర్థిక సహాయం కూడా అల్లు అర్జున్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
—————————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-