HPCL Recruitment:హెచ్‌పీసీఎల్ వివిధ డిపార్ట్‌మెంట్ కు సంబందించిన ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో నియామకం అయిన వారికి అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల రూ.2.4 లక్షల జీతం వస్తుంది. ఖాళీలు తక్కువగా ఉన్నప్పటికీ కష్టపడిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. పదోన్నతులు కూడా తొందరగా వస్తాయి. ప్రతిభావంతులకు మంచి అవకాశం.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇటీవల వరుసగా ఉద్యోగ నియామకాలు చేబడుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. మొత్తం 247 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు HPCL అధికారిక వెబ్‌సైట్ ద్వారా hindustanpetroleum.comలో ధరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది.
ప్రతి పోస్టుకు విద్యార్హతలు, ఖాళీల సంఖ్య విడివిడిగా ప్రకటించింది. కొన్ని పోస్టులకు ఉద్యోగ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అన్ని ఉద్యోగాలకు నిర్ణీత వయో పరిమితి ఒకే విదంగా ప్రకటించింది. అభ్యర్థుల వయసు 25 ఏళ్ల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో పరిమితి సడలింపు ఉంది. మరిన్ని పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.