Govt Job : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే కనీసం డిగ్రీ అర్హత తప్పనిసరి. ఇప్పడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకోవాలని కోరుతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని అలవెన్సులు కలిపి సుమారుగా ప్రతినెల 34,800 వేతనం పొందడానికి అవకాశం ఉంది. నియామకం అయిన నాటి నుంచే పర్మినెంట్ ఉద్యోగిగా గుర్తించబడుతారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 27లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో తెలిపిన విదంగా అర్హత గలవారు దరఖాస్తు ఫీజు ను ఆన్లైన్ లోనే చెల్లించాలి. ఆగష్టు 27 నుంచి 28 వరకు ధరఖాస్తులను పరిశీలించి పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇంటర్ తో పాటు అదనంగా స్టెనో కోర్స్ పూర్తి చేసినవారు గ్రేడ్-సి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు 18 నుంచి 30 ఎల్ల లోపు ఉండాలి. అదేవిదంగా ఇంటర్ తో పాటు స్టెనో అర్హత ఉన్నవారు గ్రేడ్- డి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనే వారి వయసు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.
ధరఖాస్తును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక పోర్టల్ ssc.gov.in వెబ్సైట్ ద్వారా చేసుకోవాలి. ధరకాస్తు చేసుకున్నవారు అన్ని అర్హతలు ఉంటె వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరిక్షలు ప్రతిభ కనబరచిన వారికి స్టెనో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు.