Home » 500 మంది డ్యాన్సర్లతో ఆడిపాడిన హింది నటుడు

500 మంది డ్యాన్సర్లతో ఆడిపాడిన హింది నటుడు

కోల్ బెల్ట్ ప్రతినిధి:
ప్రేక్షకులను అలరించడానికి హిందిలో కొత్త తరహా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ ప్రముఖ నటుడు అందులో నటిస్తున్నారు.ఈ సినిమాకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. బాలీవుడ్ లోని నటీ, నటు లందరిని ఒక్కటిగా చేయబోతోంది.కొత్త అంశంతో ప్రేక్షకులను అక్కట్టుకోడానికి సిద్ధ మవుతోంది. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తోంది. అహ్మద్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గణేష్ ఆచార్య కొరియో గ్రఫీ చేస్తున్నారు.మునుపెన్నడూ లేనివిదంగా ఈ సినిమాలో హీరో నటిస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా….
ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ” వెల్ కం టు ది జంగిల్ ” అనే సినిమాలో నటిస్తున్నారు.అక్షయ్ కుమార్ తో పటు మరో 30 మంది నటీ నటులు ఈ సినిమాలో నటించడం విశేషం.అయితే ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలు ప్రేక్షకులు,అక్షయ్ కుమార్ అభిమానులు చూడబోతున్నారు.అక్షయ్ కుమార్ కోసం దర్శక,నిర్మాతలు ప్రత్యేకంగా ఒక పాటను సినిమాలో చిత్రీకరించడం విశేషం. అక్షయ్ కుమార్ తో కలిసి 30 మంది నటులు కూడా నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాటలు,పోరాటాల విషయంలో ఎక్కడ కూడా దర్శక,నిర్మాతలు రాజీపడటంలేదు

500 మందితో ….
అక్షయ్ కుమార్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.ప్రత్యేకంగా భారీ ఖర్చుతో ఒక సెట్ వేశారు.సెట్ నిర్మాణానికి సాంకేతిక వర్గం చాల శ్రమించాల్సి వచ్చింది.హీరో అక్షయ్ కుమార్ స్థాయికి తగిన విదంగా సెట్ వేయడం జరిగింది.ఈ ప్రత్యేక పాటలో అక్షయ్ కుమార్,30 మంది నటీనటులతోపాటు 500 మంది డ్యాన్సర్లతో కలిసి నృత్యం చేయనున్నారు.ఈ పాట షూటింగ్ ఈ నెలాఖరున జరుగనుంది. సినిమా షూటింగ్ ను వేగవంతంగా చేస్తున్నారు. డిసెంబర్ 20 న “వెల్ కం టు ది జంగిల్ “సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడనికి సన్నాహాలు చేస్తున్నారు.

—————————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *