Tiger Food : పులికి వేటాడి తినడం ఇష్టం. అడవిలో వేటాడితే కొన్ని సందర్భాల్లో పులికి సకాలంలో దొరుకు తుంది. మరికొన్ని సందర్భాల్లో ఆహారం దొరకకపోవచ్చు. వేటాడి తినే ఆహారం ఇంత తినాలి అనే లెక్క మాత్రం ఉండదు. వేటాడి తినంగ మిగిలిన ఆహారాన్ని వదిలి వెళుతుంది. కానీ జూ పార్క్ లో ఉండే పులి ఎంత ఆహారం తింటుందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం.
బోనులో ఉన్న పులిని ఉదయం ఎనిమిదిన్నర గంటలకు బయటకు వదిలిపెడుతారు. ఉదయం పదకొండు గంటలకు ఆహారం పెట్టడం మొదలవుతుంది. ముందుగా పులికి అర్ధ లీటర్ పాలతో పాటు కిలోన్నర కోడి మాంసం అందజేస్తారు. ఆ తరువాత సాయంత్రం ఐదు గంటలకు పది కిలోల మేక మాంసం పెడుతారు. ఈ విదంగా ప్రతిరోజు జూ పార్క్ లో ఉండే పులి ఆహారం మెనూ ఉంటుంది. చీకటి పడుతుండగానే తిరిగి పులి బోనులోకి వెళుతుంది.