Virat Kohli : బెంగుళూర్ జట్టు ప్రధాన ఆటగాడు విరాక్ కోహ్లీ . ఉన్నట్టుండి ఒక్కసారిగా కోహ్లీ కి భద్రత పెరిగింది. విరాట్ కోహ్లీ ని బెంగుళూర్ జట్టు వజ్రం తో సమానంగా చూస్తోంది. మరికొద్ది గంటల్లో బెంగుళూర్, రాజస్థాన్ జట్ల మధ్య అట ప్రారంభం కానుంది. ఇంతలో ఊహించని పరిణామం ఎదురైనది బెంగుళూర్ జట్టుకు. జట్టు క్రీడాకారులు అంతా షాక్ కు గురైనారు.
ఎక్కడైతే కోహ్లీ ఆడబోతున్నాడో అదే ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే విరాట్ కోహ్లీ కి భారీ భద్రత పెంచారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూడా భద్రత కట్టుదిట్టం చేసారు. నరేంద్ర మోదీ స్టేడియం లో కూడా భద్రత పెంచారు. ప్రేక్షకులను స్టేడియం లోనికి పంపిస్తున్నారు.
అరెస్టు చేసిన ఉగ్రవాదులను పోలీసులు తమదయిన శైలిలో విచారించారు. విచారణలో ఇన్ని రోజులుగా ఉన్న రహస్య ప్రదేశాన్ని, ఆయుధాలను, పలు వీడియోలను పోలీసులకు అప్పగించారు. నలుగురిని అరెస్ట్ చేసింది మంగళవారమే అయినప్పటికీ, ఈ సంఘటన మాత్రం బుధవారం వెలుగులోకి రావడం విశేషం. ఉగ్రవాదుల అరెస్ట్ నేపథ్యంలో బెంగుళూర్ జట్టు ప్రాక్టీస్ రద్దు అయ్యింది. ప్రెస్ మీట్ కూడా విరమించుకున్నారు.