Team India : టీ -20 ప్రపంచ కప్ పోటీలకు అమెరికా వేదికయినది. పోటీలో పాల్గొనే టీం లో ఒక్కొక్కటిగా అమెరికా చేరుకుంటున్నాయి. టీం ఇండియా జట్టు కూడా అమెరికా చేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు జట్టులోని మరి కొందరు క్రీడాకారులు న్యూయార్క్ చేరుకున్నారు. బుమ్రా, సిరాజ్, సూర్యకుమార్, శివమ్, పంత్, జడేజా, దూబే, కుల్ దీప్ యాదవ్, అక్షర్ తో పాటు రిజర్వ్ ఆటగాళ్లు శుభమ్ గిల్, ఖలీల్ అహ్మద్ న్యూయార్క్ చేరుకున్నారు. కోహ్లీ, హార్థిక్ పాండ్య వెళ్లాల్సి ఉంది. రెండో విడిత ఆటగాళ్లతో కలిసి వెళ్లే అవకాశం ఉంది. ప్రధాన కోచ్ ద్రవిడ్ ప్రస్తుతం వెళ్లిన జట్టుతోనే వెళ్లారు. కోచింగ్ సిబ్బంది కూడా అమెరికా వెళ్లారు. మిగితా ఆటగాళ్లు రెండు రోజుల్లో బయలుదేరే అవకాశాలు ఉన్నాయి.