Cricket Coach : ప్రపంచ కప్ పోటీలు ముగిసిన అనంతరం ప్రస్తుత ఇండియా టీం ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం కూడా ముగియనుంది. పదవీ కలం ముగుస్తున్నప్పటికీ రాహుల్ ద్రావిడ్ రెండోసారి కూడా కోచ్ గ ఉండటానికి దరఖాస్తు చేసుకోవడం విశేషం. రాహుల్ ద్రావిడ్ మరోసారి ఎంపిక అవుతాడో లేదో తెలియదు. కానీ లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉండగానే రాహుల్ ద్రావిడ్ కూడా పోటీ కి రావడం తో క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
కోచ్ పదవి కోసం తాజాగా బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. టీం ఇండియా కు లక్ష్మణ్ అయితేనే బాగుంటదనే అభిప్రాయాలు క్రికెట్ అభిమానుల నుంచి వ్యక్తం కావడం విశేషం. నెటిజన్లు కూడా లక్ష్మణ్ వైపే మొగ్గు చూపారు. సోషల్ మీడియా లో కూడా అభిమానుల కోరిక వెల్లడైనది. లక్ష్మణ్ ప్రస్తుతానికి అండర్-19 జట్టుకు కోచ్ గ ఉన్నారు. కానీ కోచ్ పదవి పై ఆశ ఉన్నట్టు రాహుల్ ద్రావిడ్ తన మనసులోని మాటను మాత్రం బయట పెట్టకపోవడం విశేషం.
ఒకవైపు లక్ష్మణ్ పేరు, మరోవైపు రాహుల్ ద్రావిడ్ పేరు మారుమోగుతుండగానే మరో క్రికెట్ దిగ్గజం పేరు బయటకు వచ్చింది. ఇండియా టీం కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు తెరపైకి రావడం జరిగింది. ఇప్పుడు ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇండియాకు చెందిన రాహుల్ ద్రావిడ్ తోపాటు లక్ష్మణ్ పోటీలో ఉన్నారు. కానీ స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితేనే జట్టుకు బాగుంటదని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు క్రికెట్ అభిమానుల సమాచారం. స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకు కోచ్ గా బాధ్యతల్లో ఉన్నారు. స్టీఫెన్ ఫ్లెమింగ్ కు అపారమైన అనుభవం ఉంది. ఇదిలా ఉండగా స్టీఫెన్ ఫ్లెమింగ్ బోర్డు పెట్టే కండిషన్ లకు అంగీకారం తెలుపుతాడా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఇండియా టీం కు కోచ్ గా ఎంపికయితే చెన్నయ్ జట్టుతో తెగతెంపులు చేసుకోవాల్సి ఉంటది.