IPL : ప్రముఖ వికెట్ కీపర్, బ్యాట్స్ మాన్ ఐపీఎల్ క్రికెట్ పోటీలకు గుడ్ బై చెప్పేశారు. ఊహించని పరిణామంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఐపీఎల్ పోటీల నుంచి ఎందుకు తప్పుకున్నారో అయన అభిమానులకు అంతుపట్టడం లేదు. పోటీలకు దూరంగా ఉండటానికి ఆయన కూడా కారణం ప్రకటించలేదు. కేవలం ఐపీఎల్ పోటీలకు మాత్రం దూరంగా ఉంటానని ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా నిరాశపరిచాడు. బుధవారం తన బెంగుళూర్ జట్టు రాజస్థాన్ జట్టు తో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆడి ఓడింది.
బెంగుళూర్ జట్టు తరుపున ఆడుతున్న వికెట్ కీపర్, బ్యాట్స్ మాన్ దినేష్ కార్తీక్ బుధవారం ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగుళూర్ జట్టు ఓడిపోయిన వెంటనే తన నిర్ణయాన్ని తెలిపారు. కార్తీక్ దినేష్ బెంగుళూర్ తో పాటు కోల్ కత్తా, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్ల తరుపున ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో 15 మ్యాచ్ లు ఆడి 36.22 సగటుతో 326 పరుగులను సాధించాడు కార్తీక్ దినేష్ .