Pulivendula Poling : ప్రత్యర్థి ఎంతటివారైనా సరే వాళ్ళను బలహీనపరచడంలో వైసీపీ కి పెట్టింది పేరు. ఆర్థిక, అంగ బలం ఉన్నా సరే వాళ్ళను మానసికంగా నీరుగార్చడంలో వైసీపీ తెలివితేటలు మరొకరికి ఉండవు. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి అధికారం చేతపట్టింది. ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంటే పైచేయి సాధించింది. చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ని కూడా వైసీపీ దక్కించుకోవడం విశేషం. అక్కడ ఉన్న 25 స్థానాల్లో 20 స్థానాలను వైసీపీ అభ్యర్థులే దక్కించుకున్నారు.
నామినేషన్ మొదలైన నాటి నుంచి మొదలుకొని పోలింగ్ జరిగే వరకు కూడా వైసీపీ నాయకుల ప్రచారం ఒకే విదంగా ఉంది. అందరి నాయకుల మాట ఒకే తీరు ప్రచారంలో ఉంటుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడంటూ ప్రచారం చేశారు. అదే విదంగా మంగళగిరిలో కూడా నారా లోకేష్ కు ఓటమి ఖాయమని ప్రజల్లోకి వెళ్లారు వైసీపీ నేతలు. అక్కడితో ఆగకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్రస్ పిఠాపురంలో గల్లంతు కావడం ఖాయమని జనంలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ విదంగా ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీస్తూ తప్పుడు ప్రచారం చేయడంలో వైసీపీ అధినేతతో పాటు, ఆయనను నమ్ముకున్న అనుచరులకు వెన్నతో పెట్టిన విద్య. అక్కడితో ఆగకుండా వైసీపీ 175 స్థానాలకు, 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ప్రతిపక్ష పార్టీలకు ఒక్క స్థానం కూడా దక్కదని ప్రచారం చేసి సత్యం పలకడంలో మాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరని ప్రకటించుకున్నారు.
పోలింగ్ ముగిసింది. ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. 83 శాతం నమోదు కావడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైనది. పోలింగ్ వరకు వైసీపీ తప్పుడు ప్రచారం చేశారు. పోలింగ్ తరువాత నుంచి టీడీపీ వంతు వచ్చింది. పులివెందులలో స్వయంగా పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోతున్నారంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం మొదలెట్టారు. అన్నకు వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేయడంతో ఓట్లు చీలిపోయాయని టీడీపీ శ్రేణులు ప్రచారం మొదలెట్టారు. అదేవిదంగా వివేకానంద రెడ్డి హత్య కేసు మరోవైపు నుంచి దాడి చేసింది. ఇలా రెండువైపుల నుంచి ఎదురుదాడి మొదలు కావడంతో వైఎస్ భారతి రెడ్డి రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ప్రచారం చేసి జగన్ గెలుపుకు బాట వేశారు. భారతి రెడ్డి ప్రచారం ఏమేరకు ఫలించనుందో వేచి చూడాల్సిందే.