Chanakyudu : ప్రతి వ్యకి తన నిత్య జీవితంలో అభివృద్ధి చెందడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. తీసుకునే కొన్ని నిర్ణయాలు చేదు ఫలితాలను తీసుకువస్తుంది. మరికొన్ని అభివృద్ధికి కారణమవుతాయి. కాబట్టి ప్రతి పురుషుడు తన నిత్య జీవితంలో ఈ ఐదు సూత్రాలు పాటించకపోతే పతనం కావడం తప్పదంటున్నాడు ప్రముఖ ఆర్థిక నిపుణుడు చాణక్యుడు. ఆ ఐదు సూత్రాలు ఏమిటో తెలుసుకుందాం……
*****ప్రతి పురుషుడు స్త్రీలను గౌరవించాలి. ఎవరైతే స్త్రీలను గౌరవిస్తారో వారికి సిరి సంపదలు పెరుగుతాయి. చివరకు భార్యను, కూతుళ్లను కూడా గౌరవంగా చూడాలంటున్నారు చాణక్యుడు.
*****పురుషుడు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదు. కోపంలో తీసుకునే నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి.
*****తన వ్యక్తిగత , కుటుంబ రహస్యాలను ఇతరులకు చెప్పరాదు. అలా చేయడం వలన మనమంటే గిట్టనివారు నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
*****తనకున్న సిరిసంపద పట్ల గర్వంతో ఉండరాదు. గర్వం మనిషిని కుంగతీస్తుంది.
*****స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహంతో నష్టాన్ని చూడక తప్పదు.