Singareni : సింగరేణి సంస్థలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే అపరిష్కృత సమస్యలు పరిస్కారమవుతాయని ఆ సంఘం ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ కుమార్ స్పష్టం చేసారు. సమస్యలను పరిష్కరించిన వాటిలో ఆయన శ్రీరాంపూర్ లో మాట్లాడుతూ కొన్నింటిని వివరించారు.
ఉప్పరాపు వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగికి రెండు సంవత్సరముల కిందట రావలసిన ప్రమోషన్ ఇప్పుడు రావడం జరిగిందన్నారు. అదేవిదంగా ఐకే 1a లో బిట్టు గ్రైండర్, ఆర్కే 5 లో మాన్ రైడింగ్ ఆపరేటరు, మరియు RK -6 లో సపోర్ట్మెన్ గా పదోన్నతి పొందిన రామకృష్ణ గారికి ఎక్కువ కేటగిరికి చెందిన కోల్కటర్ ప్రమోషన్, ఎస్ ఆర్ పి త్రీ లో పంపు ఆపరేటర్ సర్ఫేస్ ప్రమోషన్ ఇప్పించడం జరిగిందని ఆయన వివరించారు. వీరిలో ప్రధానంగా ఎస్ఆర్పి వన్ కు చెందిన ఉప్పారపు వెంకటేష్ హామెర్ మెన్ సర్ఫేస్ ప్రమోషన్ అనేది రెండు సంవత్సరముల క్రింద రావలసిన ప్రమోషన్ వివిధ కారణాల వలన రెండు సంవత్సరాలు తర్వాత తమ సంఘం అధికారులతో చర్చించి ఇప్పించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా కార్మికులకు రావలసిన ప్రమోషన్లు న్యాయంగా ఇచ్చినటువంటి సింగరేణి యజమాన్యానికి ముఖ్యంగా చైర్మన్ బలరాం , డైరెక్టర్స్ కు, జిఎం పర్సనల్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ , ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులకు, ఐ ఈ డి అధికారులకు ఈ ప్రమోషన్ ఇప్పించడానికి సహకరించిన అధికారులు అందరికీ మా అసోసియేషన్ తరపున అయన ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న జనరల్ సెక్రెటరీ ఆంతోని నాగేశ్వరరావు, అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ చిరంజీవులు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టి వర్కింగ్ ప్రెసిడెంట్ దారావత్ రాజేష్, లక్ష్మణ్, నర్సింగరావు శంకర్ మురళి, యుగేందర్ సాయి ,మహేందర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు