Sikasa Letter : సింగరేణి ప్రాంతంలో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సింగరేణి భవిష్యత్తు కోసం కార్మికులతో కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి సింగరేణి బొగ్గు బ్లాక్ ల వేలాన్ని రద్దు చేయించాలని సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రభాత్ మీడియా కు ఒక లేఖ విడుదల చేశారు. వేలాన్ని రద్దు చేయించని నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పట్టిన గతే మీకు పడుతుందని అయన హెచ్చరించారు.
సింగరేణి స్వచ్చంద సంస్థ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై అధికారాన్ని చెలాయిస్తూ బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి చట్టాలను సవరించి వేలం పాట వేస్తున్నదని ప్రభాత్ తన ప్రకటనలో ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గపు చర్యలను ఆపివేసి సింగరేణి బొగ్గు గనులన్నిటిని భేషరతుగా సింగరేణి సంస్థకే అప్పగించాలని ప్రభాత్ తన ప్రకటనలో డిమాండ్ చేశారు.
సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలనీ, బొగ్గు బ్లాక్ లన్నింటినీ సింగరేణి సంస్థకే అప్పగించాలని, ఓపెన్ కాస్ట్ గనులను రద్దు చేసి, భూగర్భ గనులను ప్రోత్సహించాలని, సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభాత్ డిమాండ్ చేశారు.