Midday : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (CITU) మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాలుగు నెలలుగా మధ్యాహ్నం భోజనం బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలకు పురుగులతో ఉన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేయడం వలన విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని. ఇందుకు మమ్మల్ని భాద్యులను చేస్తే సహించేది లేదన్నారు. నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేస్తున్న అధికారులే విద్యార్థుల ఆరోగ్యానికి భాద్యత వహించాల్సి ఉంటుందని ఆమె ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విదంగా అధికారంలోకి వస్తే మద్యాహ్న భోజనం కార్మికులకు ప్రతి నెల రూ : 10 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చాలని ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిచో తాము చేపట్టే శాంతియుత ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (CITU) జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, గురువక్క,కనక దేవేంద్ర, కోట్నాక సాంద్రుబాయి, సాయక్క, అంకమ్మ, మణెమ్మ, కమలాబాయి, పోషక్క తదితరులు ఉన్నారు.