shivaji : బీబీపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శివాజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా శివాజీ విగ్రహానికి ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పూలమాల వేసి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. వీర శివాజీ … జై శివాజీ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. పలువురు శివాజీ అభిమానాన్ని చాటుతూ పాడిన పాటలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి.
అనంతరం మిఠాయిలు పంచుకొని జయంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. శివాజీ బాటలో నడవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ ఫౌండేషన్ సభ్యులు సుతారి రమేష్, తోట రమేష్, పాండు, గాండ్ల సీతారాములు, గాండ్ల సిద్ధ రాములు, చింత కింది లింగం, గ్రామపంచాయతీ సెక్యూరిటీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.