OLD SITY : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేసవి ఉష్ణోగ్రతను మించి పోతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరు పోటీ ఉంది.గెలుపోటములు ఎలా ఉన్నప్పటినికిని ఒక పార్టీ పై మరొక పార్టీ ప్రధాన నేతలు మాత్రం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విమర్శలు కూడా తీవ్రంగానే ఉంటున్నాయి.
పాత బస్తీలో పొలిటికల్ పోరు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. వాళ్ళ నియోజకవర్గంలోని అభ్యర్థుల రాజకీయాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ నియోజక వర్గం గురించే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పేరుకు హైదరాబాద్ కానీ పాత బస్తి అనే పేరుతోనే రాజకీయ క్రీడ నడుస్తోంది. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి ఒవైసి కాకలు తీరిన నాయకుడు. ఆయన్ను ఎలాగయినా ఓడించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అందుకు తగిన అభ్యర్థిని ఎవరు ఊహించని విదంగా మహిళను తెరపైకి తీసుకు వచ్చింది.బీజేపీ అభ్యర్థిగా మాదవి లత బరిలోకి దిగడంతో కాషాయం శ్రేణులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పుడు ఆమె నియోజక వర్గం అని కూడా చూడకుండా పాత బస్తీ నే ఎక్కువగా ప్రచారంలో చేట్టేస్తోంది.విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నం చేస్తోంది. ఆమె పర్యటన తీరుతో ప్రచారం పద్దతే మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాతబస్తీ రాజకీయం వేడెక్కి పోయింది. ప్రచారంలో భాగంగా పతంగిని కట్ చేసి మాదవి లత చూపించిన తీరు చూస్తే ఎంఐఎం అభ్యర్థి తెగిపోయిన గాలిపటం అని చెప్పకనే చెప్పింది. ఒవైసి ఇంటికి బాణం ఎక్కుపెట్టి యుద్దానికి సిద్దమయ్యాను అంటూ చూపించింది.మాదవి లత ఊహించని విదంగా దర్గాకు వెళ్ళింది. చాదర్ ను సమర్ఫించింది. దువా చేయాలని ముస్లిం పెద్దలు కోరడంతో సమాధిపై చాదర్ పెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సంఘటన తెలిసిన ముస్లిం మత పెద్దలు మండిపడుతున్నారు.
ఎంఐఎం అభ్యర్థిగా బరిలో దిగిన అసదుద్దీన్ ఒవైసి నియోజక వర్గంలో పాదయాత్రలు చేస్తున్నారు. తన గెలుపై పెద్ద దీమాలోనే ఉన్నారు. ప్రజలతో కలిసి ముచ్చట పెడుతున్నారు. తెలుగులో రచించిన పాటలు హోరెత్తుతున్నాయి. పెద్దకూర తింటాం… అసదుద్దీన్ ఒవైసీని గెలుపించుకుంటామంటూ ఎంఐఎం శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదం నియోజకవర్గంలో వివాదమైనది.
కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో తన అభ్యర్థిని ప్రకటించడంలో మాత్రం ఆలస్యం చేసింది. ఇక్కడ బోణి కొట్టాలనే ప్రయత్నం చేసిన ఫలితం ఉండదు.కాంగ్రెస్ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన సమీర్ ను ప్రకటించింది. అయినప్పటికిని కాంగ్రెస్ విజయం అంతగా సాధ్యమయ్యే పని కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-