కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తీర్పు ఇవ్వబోతున్నారు.అదేవిదంగా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాన్ ల మీద కూడా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు అభిప్రాయాన్ని చెప్పనున్నారు. నామినేషన్ ల ప్రక్రియ ఆరంభమైనది. మే నెలలో ఓటింగ్,జూన్ లో ఫలితాలు వెల్లడికానున్నాయి.అధికారం చేపట్టడానికి జనసేన,తెలుగుదేశం,బిజెపి ఒక్కటయ్యాయి.ప్రజల అభివృద్ధిని పక్కకు పెట్టి, తన సొంత అభివృద్ధికే సమయం కేటాయించుకున్నాడని కూటమి పార్టీలు ఆరోపిస్తూ ప్రజలను ఓటు అడుగు తున్నాయి. చేసిన అభివృద్ధి పేరుతో మరోసారి అధికారం ఇవ్వాలని సీఎం జగన్ కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నారు.సెంటుమెంట్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒంటరిగా బరిలో నిలిచారు.అన్న చెల్లెలు చెరొకవైపు ఉండి,పోరాటం చేస్తుండగా,మూడు పార్టీలు ఏకమై
జగన్ ను గద్దె దించడానికి సన్నద్ధమయ్యాయి.
ఫల్ పోల్ సర్వే …..
ఫల్ ఫోల్ అనే స్వచ్చంద సంస్థ ఓటరు అభిప్రాయం కోరుతూ సర్వే చేపట్టింది. దాదాదాపుగా 20 కి పైగా పేజీలతో ఉన్న సర్వే ను వెల్లడించింది.పార్టీల పరంగా సాధించే సీట్లు ఎన్ని. మెజార్టీ ఎంత.ఏ నాయకుడు ముఖ్య మంత్రి అయితే పరిపాలన బాగుంటది.ఓటరు ఎవరిని కోరుకుంటున్నారు అనే వివిధ అంశాలపై ఫల్ ఫోల్ సంస్థ సర్వే చేపట్టింది. అసెంబ్లీ కి జరుగుతున్న 175 స్థానాలతోపాటు,25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరి బలమెంత,ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తున్నారు అనే సర్వే ఫలితాలను ప్రజల ముందు ఉంచింది.
గెలిచే స్థానాలు ఇవే….
పోటీ మాత్రం కూటమి తో పాటు జగన్ పార్టీల మధ్యనే ఉంటుందని సర్వే లో ప్రజలు అభిప్రాయపడ్డారు .భాతీయ జనతా పార్టీ,తెలుగు దేశం,జనసేన కలిసి మొత్తంమీద 100 నుంచి 105 సీట్లలో అభ్యర్థులు గెలుస్తారని సర్వే లో తేలింది. YSRCP పార్టీ తరుపున బరిలో నిలిచిన వారు 55 నుంచి 60 లోపు స్థానాల్లో గెలుపొందే అవకాశాలు కనబడుతున్నాయి. 25 నియోజకవర్గాల్లో మాత్రం కూటమికి జగన్ మధ్యనే పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాకినాడ,బందరు జనసేన, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూటమి,కడప,నంద్యాల,తిరుపతి,అరకు,కర్నూల్,రాజంపేట పార్లమెంట్ స్థానాల్లో YSRCP అభ్యర్థులు విజయ పతాకాన్ని ఎగురవేసే అవకాశాలు కనబడుతున్నాయని ఫాల్ ఫోల్ సర్వే ప్రకటించింది.