Home » BRS : BRS పార్టీ పేరు మారుతోంది ?

BRS : BRS పార్టీ పేరు మారుతోంది ?

BRS : ఏళ్ల తరబడి తెలంగాణ సాధన కోసం నిరంతరం ఉద్యమం. ఆ తరువాత పదేళ్ల పాటు చేతిలో తెలంగాణ పగ్గాలు. పదేళ్ల గులాబీ అధినేత కేసీఆర్ పరిపాలనలో కొంత మోదం. మరికొంత ఖేదం. ఇందులో ఎమ్మెల్యేల పనితీరు కొంత ఉండగా, అధినేత పనితీరు కూడా మరి కొంత చేరింది. రెండోసారి అధికార పగ్గాలు చేత పట్టగానే పగ్గాలు అదుపు తప్పిపోయాయి. ముఖ్యముగా ప్రాంతీయ పార్టీగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ని అధినేత కేసీఆర్ జాతీయ పార్టీగా నామకరణం చేశారు. భారత రాష్ట్ర సమితిగా రూపొందిన పార్టీ ఆ దిశగా అభివృద్ధి అడుగులు వేయలేక చతికిల పడిపోయిందనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీ శ్రేణులు ఊహించని రీతిలో ఫలితాలను మోయాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ జాతీయ పార్టీ అనే మచ్చ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇది మీ పార్టీ. తెలంగాణ సాధన కోసం పుట్టింది. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలంటూ ప్రచారం చేశారు కేటీఆర్. అయినప్పటికీ అధినేత ఆశించిన ఫలితాలు కనబడలేదు.

ఓటమి చెందిన నాటి నుంచి అధినేత కేసీఆర్ అమావాస్య, పౌర్ణమి ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అయన ప్రజల్లోకి వచ్చి మాట్లాడాల్సిన విషయం ఏదయినా ఉందా అంటే ఏమి లేదు. ఏ విషయం మాట్లాడితే ప్రజలు నమ్ముతారు ? . ఎలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ? పార్టీని బిఆర్ఎస్ చేయడంతోనే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో ఉన్నాయి. అదే విదంగా పార్టీ ఓటమికి కూడా కారణాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పార్టీ మూటగట్టుకున్న మంచి, చెడు మరచి పోతారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా అంటే బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మార్చి ప్రజల్లోకి వెళ్లడమే మంచిదనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇదే అంశంతో ఆయన ఆయన అనుచరులతో పాటు రాజకీయ పండితులతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *