benguloor Win: గుజరాత్ లో IPL 17 మ్యాచ్ జరిగింది. బెంగుళూర్ జట్టు, గుజరాత్ జట్టు హోరా హోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగుళూర్ జట్టు ఘనవిజయం సాధించింది.
ముందుగా గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకొంది. మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బ్యాటింగ్ చేసిన వృద్ధిమాన్ సహా (5) , శుబ్ మన్ (16) పరుగులు చేసి అభిమానులను నిరాశకు గురిచేశారు. ఆ తరువాత వచ్చిన సాయి సుదర్శన్ (84) తో పరుగుల వేగాన్ని పెంచి అజేయంగా నిలిచాడు. ప్రత్యర్థుల ధాటిని ఎదుర్కొంటూనే వరుసగా సిక్స్ లు, ఫోర్లు బాదుతూ ఇబ్బందికి గురిచేశాడు. సుదర్శన్ బ్యాటింగ్ కొద్దీ సేపటివరకు ప్రత్యర్థులకు చిక్కకుండా ఆడటం విజయానికి దగ్గరైనది. ఆ తరువాత వచ్చిన షారూఖ్ ఖాన్ (58) అర్ధసెంచరీ చేసి జట్టుకు ఊపిరి పోశాడు. గెలుపు దిశలో పయనిస్తున్న జట్టుకు ఆ ఇద్దరి ఆశలపై నీళ్లు చల్లాడు మహ్మద్ సిరాజ్. వీరి తరువాత బరిలోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (26*) సైతం మంచి స్కోర్ సాధించి జట్టుకు అండగా నిలిచాడు.
బెంగుళూర్ జట్టు 201 పరుగులు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. జట్టు ఆశలన్నీ కూడా విల్ జాక్స్, కోహ్లీ పైననే ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన విల్ జాక్స్ (100), విరాట్ కోహ్లీ (70) పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశారు. ఇద్దరు కలిసి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతి బాల్ ను సద్వినియోగం చేసుకొని జట్టుకు అండగా నిలిచారు.సిక్స్,ఫోర్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపించారు, ఒక వికెట్ పడిపోయిన తరువాత వచ్చిన ఫాఫ్ డుప్లెసిస్ (24) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంతో జట్టు అజేయంగా నిలువడానికి కీలక పాత్ర పోషించినట్టు అయ్యింది.
బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్ ముగ్గురు కలిసి ఒక్కో వికెట్ తీసి జట్టు విజయానికి అండగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రవి శ్రీనివాసన్ ఒక్క వికెట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-