Malkajgiri : తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వేడికింది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో గెలువడానికి ప్రధాన పార్టీలు కుస్తీపడుతున్నాయి. ఎక్కడ చుసినా పోటీ కాంగ్రెస్,భారతీయ జనతా పార్టీ,భారత రాష్ట్ర సమితి మధ్యనే కొనసాగుతోంది. ఫలితాల్లో ఎవరికీ ఈస్థానం దక్కుతుందో తెలియదు. కానీ పోటీ ఆ పోటీగా ప్రచారం చేస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ దిశగా పయనించవచ్చనేది బీజేపీ ఆశ.పోయిన పరువు తోపాటు పార్టీని కాపాడుకోవాలంటే బిఆర్ఎస్ కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే. కనీసం పదికి పైగా స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుంటేనే సీఎం రేవంత్ రెడ్డి వందరోజుల పాలనకు ప్రజలు మార్కులు వేసినట్టు అవుతుంది.
రాష్ట్రంలోని 16 స్థానాల్లో పట్టుదల ఒకతీరు ఉంది. కానీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మీదనే ప్రధాన పార్టీల మనసు ఎక్కువగా కేంద్రీ కృతమైనది. ఎందుకంటే ఆ స్థానం నుంచి ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి గెలిచారు. ఎంపీగా బాధ్యతల్లో ఉండే ఆయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గ గెలిచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి అయ్యాక ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి రాగిడి లక్ష్మా రెడ్డి పోటీలో ఉన్నారు. అదేవిదంగా భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమ కారుడు,రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీచేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజి గిరి నుంచి పోటీ చేసే సమయానికి అక్కడ కనీసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ప్రజాప్రతినిధి లేడు. అయినా రేవంత్ రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ బలం పార్లమెంట్ లో మూడుకు పెరిగింది. అదే ఎన్నికల్లో బిఆర్ఎస్ 9, కాషాయం 4, ఎంఐఎం ఒక స్థానం తో సరిపెట్టుకున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి తన ఎంపీ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో మల్కాజిగిరి లో ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా అయినా మల్కాజిగిరి స్థానాన్ని గెలిచి సీఎం స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఆదేవిందగా మాజీ సీఎం కేసీఆర్ కు కొరకరాని కొయ్యలా తయారైన రేవంత్ రెడ్డి ప్రతిష్ఠతకు బంగం కలిగించడానికి పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.ఈటల రాజేందర్ గెలుపు కోసం స్వయంగ మోదీ నే ప్రచారం చేశారు. అంటే రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజిగిరి స్థానం మీదనే అందరి మనసు ఉందనేది ప్రజలకు తెలిసిపోయింది.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-