BRS : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. పార్టీ అధినేత మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు. ఉద్యమ కారుడు. కొత్తగా రాష్ట్రము ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో పరిపాలించారు. పార్టీలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. అదేవిదంగా పరిపాలన పరంగా కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో అధినేత కేసీఆర్ కే తెలియాలి. ఉద్యమ కాలంలో తిరుగులేని నేతగా కొనసాగాడు. అదేవిదంగా ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా కనుసైగలతో నిర్వహించారు. అటువంటి నాయకుడు ముచ్చటగా మూడోసారి కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ఆశించారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలకె పార్టీ పరిమితమైనది. దింతో అధికారానికి పార్టీ దూరమైనది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా ఎందరు కాంగ్రెస్ గూటికి వెలుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికిని చాటుకోలేకపోయింది బిఆర్ఎస్ పార్టీ. మరోవైపు అధినేత కు కూతురు బెంగ పట్టుకుంది. దేశంలోనే పేరుపొందిన నాయకుడు కనీసం కూతురును కాపాడుకోలేక పోయిండు. భవిష్యత్తులో మాకేమైనా ఇబ్బంది ఎదురైతే మా పరిస్థితి కూడా కవిత మాదిరిగానే ఉంటుందా అనే అనుమానాలు గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ పార్టీలో దిద్దిబాటు చర్యలు చేపడుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. పక్క రాష్ట్రమైన తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. డీఎంకే అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ విడిచి మరోపార్టీ లోకి వెళ్లరు. పార్టీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటారు. అందుకు కారణాలు ఏమిటి.
పార్టీ అధికారంలో లేకుంటే డీఎంకే నాయకులు అధికారంలో ఉన్న పార్టీలోకి ఎందుకు వెళ్లడంలేదు. తెలంగాణలో ఎందుకు వెళుతున్నారు. అదేవిదంగా డీఎంకే నాయకుల్లో ఒక మంచి క్రమశిక్షణ కూడా ఉంది. ఎమ్మెల్యే గా గెలిచిన నాయకుడు మంత్రి పదవి కోరుకోడు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కావాలని కోరుకుంటారు. ఎందుకంటే పార్టీ పదవిలో ఉంటె నిత్యం ప్రజల్లో ఉండే అవకాశం ఉంటుంది. మరోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే డీఎంకే పార్టీ విధివిధానాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఎలా ఉన్నాయి వంటి తదితర అంశాలను పరిశీలించడానికి రెండు రోజుల కిందటనే అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను తమిళనాడు రాష్ట్రానికి పంపారు. బాల్క సుమన్ ఇచ్చిన డీఎంకే నివేదిక ఆధారంగా బిఆర్ఎస్ పార్టీలో దిద్దుబాటు చర్యలకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.