pavankalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఒంటరిగా ఎన్నికల బరిలో ఉండలేదు. భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు.జగన్ ఓడించడానికే కలిసి కట్టుగా ప్రచారం చేస్తున్నారు.పిఠాపురం నుంచే అసెంబ్లీ బరిలో ఉన్నారు.నామినేషన్ కూడా వేయడం పూర్తయ్యింది. అఫిడవిట్ లో తనకున్న ఆస్తులు,తెచ్చుకున్న అప్పులు,నికర ఆదాయం,ఇచ్చిన విరాళాలు,స్థిర ఆస్తులు పోలీస్ కేసులతో సహా పొందుపరిచారు.
పవన్ కళ్యాణ్ కు ఉన్న అప్పుల విషయానికి వస్తే ఆయన సినీ నిర్మాతల వద్దనే తీసుకున్నట్టు తెలుస్తోంది.ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆయన కొత్త సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇప్పటికే అయన ఎన్నికల సమయం ఆసన్నమయ్యేనాటికే కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా ఆ సినిమాలు పూర్తి కాలేదు. ఆ సినిమాలు పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందని సినీవర్గాల సమాచారం.కొత్తగా అంగీకరించిన సినిమాలు పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందని సమాచారం.మొత్తంమీద పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన సినిమాలతో పాటు, ఒప్పుకున్న సినిమాలతో కలిపి రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ఒకవేళ అధికారం లోకి వచ్చినా ఆయన అధికార భాద్యతలు తీసుకునే అవకాశం ఎక్కడ కూడా కనబడుటలేదు. అధికారంలో తలదూర్చకుండా సినిమా షూటింగులన్నీ పూర్తయ్యే వరకు దూరంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే కనీసం రెండేళ్లపాటు సినిమా షూటింగులతోనే తీరిక లేకుండా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగ ఉంది…సినిమాలకే దగ్గరగా ఉంటారనే ప్రచారం రాజకీయ వర్గాలతోపాటు, సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-