శ్రీరాంపూర్: మే డే పురస్కరించుకొని AITUC శ్రీరామ్ పూర్ ఏరియా స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కె సమ్మయ్య శుక్రవారం తెలిపారు. సమ్మయ్య శ్రీరామ్ పూర్ ఏరియాలోని RK 5 గని కార్మికులతో ఈ సందర్బంగా మాట్లాడుతూ కార్మిక దినోత్సవము గురించి వివరించారు. ఎంతోమంది కార్మికుల బలిదానం,శ్రమ కార్మిక దినోత్సవంలో ఉందన్నారు. మే డే విజయ వంతం చేయడానికి ఈ నెల 28న శ్రీరామ్ పూర్ లోని నస్పూర్ కాలనీ లోని మనోరంజన్ సముదాయంలో సాయంత్రం ఐదు గంటలకు సమావేశాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ సమావేశాన్ని విజయ వంతం చేయడనికి కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాల్సిందిగా సమ్మయ్య ఈ సందర్బంగా కార్మికులను కోరారు. సమావేశానికి యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్ తోపాటు యూనియన్ బెల్లంపల్లి రీజియన్ స్థాయి నాయకులు, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియా స్థాయి నాయకులు కూడా పాల్గొంటున్నారని సమ్మయ్య ఈ సందర్బంగ తెలిపారు. అదేవిదంగా శ్రీరాంపూర్ ఏరియా లోని అన్ని గనులు,డిపార్ట్మెంట్ ఫిట్ కమిటీ నాయకులు సకాలంలో పాల్గొనాల్సిందిగా యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య కోరారు.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-