Peddapalli : ప్రభుత్వ అనుమతి లేకుండా పెద్దపల్లి మండలంలో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలను వెంటనే మూసివేయాలని కోరుతూ TNSF పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండీ వాజిద్ ఎంఇఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వాజిద్ మాట్లాడుతూ మండలంలో పలు విద్యాసంస్థలు అనుమతి లేకుండా విద్యాబోధన చేస్తున్నాయని, తద్వారా విద్యార్థులు భవిష్యత్తులో అనేక విధాలుగా నష్టపోతారన్నారు. పాఠశాల ఆవరణలోనే నిబంధనలకు విరుద్దంగా పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్ , టై , బెల్ట్ అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.
బోధనార్హతలు లేని వారితో పలు సంస్థలు తరగతులు నిర్వహిస్తున్నారని, తద్వారా విద్యార్థుల్లో నాణ్యత దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. కొని పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా సరిగా లేవని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయుల విద్యార్హతలు, మౌలిక వసతులు, ప్రభుత్వ గుర్తింపు వంటి సమస్యలపై తనికీలు చేపట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఎండి వాజిద్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వెంకటేష్, రాజేష్, మొయిన్ తదితరులు ఉన్నారు.