RTC : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ సంస్థ శుభ వార్త ప్రకటించింది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ పథకం ద్వారా అక్కడక్కడ చిన్న, చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా ఆర్టీసీ తన సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టింది. దింతో కాలుష్య నివారణ కూడా అవుతోంది.
బస్సులలో పురుషులకు మాత్రం టికెట్ తీసుకోవడం తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చిల్లర సమస్య ఎదురవుతోంది. ఈ సమస్య వలన కండక్టర్, ప్రయాణికులు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. కొందరు ప్రయాణికులు చిల్లర మరచిపోతున్నారు. చిల్లర లేకపోవడంతో ఇద్దరు, ముగ్గురికి కలిపి కండక్టర్ ఇవ్వడంతో ఆ ప్రయాణికుల్లో కూడా ఇబ్బంది ఏర్పడుతోంది.
ఈ సమస్యను నివారించడానికి ఆర్టీసీ సంస్థ ఒక నిర్ణయం తీసుకొంది. ప్రతి కండక్టర్ వద్ద క్యూ ఆర్ కోడ్ ను అందుబాటులో పెట్టింది. ఆ కోడ్ ద్వారా ప్రయాణికులు తగిన ఛార్జ్ చెల్లించి ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ విధానం వలన ఆర్టీసీ కండక్టర్ సమయం ఆదా అవుతోంది. చిల్లర సమస్య రాదు. ప్రయాణికుడు కూడా చేతిలో నగదు లేకుండానే ప్రయాణించే అవకాశం కలిగింది.