Home » pavan kalyan : పరిపాలనలో రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్

pavan kalyan : పరిపాలనలో రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్

pavan kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే ప్రపంచ స్థాయి రికార్డ్ సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించి ఈ రికార్డు సృష్టించారు.

ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజు గ్రామ సభలు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ సభలో రూ: 4500 కోట్ల పనులకు తీర్మానాలు చేయడం విశేషం. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన సభలు అతి పెద్ద గ్రామ పరిపాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేశారు.

ఈ రికార్డ్ కు సంబంధించిన సర్టిఫికెటును హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో సోమవారం వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అందజేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామ సభలు ఒకే రోజు విజయ వంతం కావడానికి సహకరించిన సహచర మంత్రులకు, ఉన్నతాధికారులకు, అధికారులకు, కూటమి నాయకులుకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *