Singareni : మందమర్రి ఏరియా సింగరేని జనరల్ మేనేజర్ దేవేందర్ సీపీఐ కార్యవర్గ సభ్యుడు, బెల్లంపల్లి నియోజకవర్గం సహాయ కార్యదర్శి దాగం మల్లేష్ కు వెంటనే క్షమాణాలు చెప్పాలని సీపీఐ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో లక్ష్మి నారాయణ ఆదివారం మాట్లాడుతూ కార్మికుని సమస్యపై జీఎం దేవేందర్ వద్దకు దాగం మల్లేష్ వెళ్లగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జనరల్ మేనేజర్ దేవేందర్ భేషరతుగా మల్లేష్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో సీపీఐ ఆధ్వర్యంలో మందమర్రి జీఎం కార్యాలయం ముట్టడి చేస్తామని, అదే విదంగా బెల్లంపల్లి రీజియన్ వ్యాప్తంగా గనులు, డిపార్టుమెంట్ల వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, బికేఎంయు జాతీయ సమితి సభ్యులు అక్క పెళ్లి బాపు, బి కే ఏం యు జిల్లా కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం, నాయకులు రత్నం రాజం, రాం కొమురయ్య, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.