Home » రాజకీయాల్లో ట్రిక్కీ గేమ్ ఆడుతున్న రేవంత్ !

రాజకీయాల్లో ట్రిక్కీ గేమ్ ఆడుతున్న రేవంత్ !

Politics : తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారనే విషయాన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వనపర్తిలో జరిగిన ఓ సభలో మోదీని విమర్శించకుండా కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఘాటుగానే ఆరోపణలు గుప్పించారు. ఇలా ఒకే సభలో మోడీని అభిమానిస్తూ, కిషన్ రెడ్డిని విమర్శించేసరికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు.

రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలనే విమర్శించేవారు. గతంలో రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్ర నాయకులనే లక్ష్యంగా చేసుకొని విమర్శించేవారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. కిషన్ రెడ్డి వారానికి ఒకసారి చుట్టం చూపులా రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఆయన్ని సీఎం విమర్శిస్తూనే ఉన్నారు. ఇంత ఘాటుగా విమర్శిస్తున్నారంటే రేవంత్ రెడ్డి చెవిలో ఎదో సమాచారం పడితేనే ఇంత ఘాటుగా విమర్శిస్తాడనే అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తమవుతూన్నాయి.

ఇంత హఠాత్తుగా రేవంత్ ఎందుకు మారిపోయాడంటూ ప్రజల్లో చర్చ కూడా మొదలైనది. సీఎం కు ఎదో కొంత ముఖ్యమైన సమాచారం తెలియడంతోనే ఆయన ప్రసంగంలో మార్పు వచ్చిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరిని కోవర్టులుగా మార్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డిని నిశితంగా సీఎం రేవంత్ రెడ్డి గమనిస్తున్నారు. ఆయన ఈ ప్లాన్‌కు నాయకత్వం వహిస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి అనుమానిస్తున్నారు. రాజకీయాలలో బిజెపి చాలా శక్తివంతమైనది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టారో తెలిసిన విషయమే. తెలంగాణలో ఇలాంటిదేదో జరుగుతుందని రేవంత్ భావిస్తున్నారని, ఈ ప్లాన్ ఇప్పటికే మొదలైందని కూడా రేవంత్ రెడ్డి అనుమానిస్తున్నారు.

ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు అధికారంలో ఉంటుందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఇటీవల మాట్లాడుతున్నారు. దీని వెనుక ఏదో కుటిల రాజకీయం ఉందని రేవంత్ భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి మోదీ ని కలిశారు. ఆ తరువాత పార్టీ అధిష్టానాన్ని మాత్రం కాలువ కుండానే రాష్ట్రానికి పయనమయ్యారు. ఒంటరిగా వెళ్లకుండా వెంట మంత్రి శ్రీధర్ బాబును కూడా తీసుకెళ్లారు. మోడీ గురించి మంచి అభిప్రాయంతో ఉన్నారు సీఎం. ఇలా చేయడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకం కోల్పోతే రెండో అప్సన్ కు తాను దగ్గరలోనే ఉన్నాననే సంకేతాన్ని కూడా పంపినట్టు రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *